Sunrisers Hyderabad: వివాదాస్పద నిర్ణయాలపై బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్‌లో అంపైర్ల నిర్ణయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై నిరసన తెలుపుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధికారికంగా లేఖ రాయాలని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ చేసిన పనే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో.. లక్నో విజయానికి రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సి ఉండగా, రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ వైపు వెళ్ళింది. ఆ సమయంలో బౌండరీ లైన్ బయట డగౌట్ వద్ద ఉన్న లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్, బంతి లైన్ దాటకముందే తన చేతిలోని బ్యాట్‌తో దానిని వెనక్కి కొట్టాడు. అప్పటికే ఫీల్డర్లు ఎవరూ అక్కడ లేనప్పటికీ, బంతి గీత దాటకముందే ఆవేశ్ అలా చేయడంపై ఎస్‌ఆర్‌హెచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి పెనాల్టీగా తమకు 5 పరుగులు ఇవ్వాలని అభిమానులు కోరినప్పటికీ, అంపైర్లు మాత్రం అది బౌండరీ వెళ్లే బంతే కాబట్టి పెనాల్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు.
కేవలం ఈ ఒక్క ఘటనే కాకుండా, అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మల అవుట్‌లపై కూడా సన్‌రైజర్స్ గుర్రుగా ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను ఫిలిప్ సాల్ట్ అందుకున్నప్పుడు, అతని కాలు బౌండరీ కుషన్‌కు తగిలిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌ను వరుణ్ చక్రవర్తి పట్టుకున్నప్పుడు, బంతి నేలకు తగిలిందా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయినా అంపైర్లు అవుట్ ఇచ్చారు. ఈ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సన్‌రైజర్స్, ఈ అంశాలన్నింటినీ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది.

