Suryakumar Yadav: భారత టీ20 జట్టులో ఊహించని మార్పులు జరిగాయి. మొన్నటివరకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడమే కాకుండా, సారథ్య బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. అయితే, ఈ పరిణామాలపై సూర్యకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరల్‌గా మారింది.

దీనిపై తాజాగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ వైరల్ పోస్ట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు సూచించాడు.

తన ఇన్‌స్టా స్టోరీలో సూర్య ఇలా రాసుకొచ్చాడు...జట్టు కూర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. టీమ్ ఇండియాకు ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు, వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది, ప్రతి క్షణాన్ని ఆస్వాదించు, దేశాన్ని గర్వపడేలా చేయ్! ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ప్రకటన నా దృష్టికి వచ్చింది. అదంతా పూర్తిగా ఫేక్! నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు, ఆ ప్రకటన నేను చేయలేదు. అసత్య ప్రచారాలను నమ్మకండి. భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అని సూర్యకుమార్ క్లారిటీ ఇచ్చాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story