Suryakumar Yadav: మా టార్గెట్ ఓలింపిక్స్ గోల్డ్ మెడల్
ఓలింపిక్స్ గోల్డ్ మెడల్

Suryakumar Yadav: భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి అభిమానుల్లో మరింత జోష్ నింపింది. అయితే - 2028 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడే తదుపరి టార్గెట్ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (LA28) వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ (టీ20 ఫార్మాట్) అధికారికంగా చేర్చబడింది. సుమారు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్ళీ ఒలింపిక్ రింగ్‌లోకి వస్తోంది.
"మేము వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచాం (2024 & 2026). మా తదుపరి లక్ష్యం 2028 ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని అత్యున్నత శిఖరాన నిలబెట్టడం. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే మా అంతిమ లక్ష్యం" అని సూర్య అన్నారు. 2028లో కేవలం ఒలింపిక్స్ మాత్రమే కాకుండా, అదే ఏడాది మరో టీ20 వరల్డ్ కప్ కూడా జరగనుంది. ఆ రెండింటినీ గెలిచి క్రికెట్ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
ఎందుకు ఇది ప్రత్యేకం?
వరల్డ్ కప్ గెలవడం ఒక ఎత్తు అయితే, ఒలింపిక్స్‌లో దేశం తరపున పతకం సాధించడం అథ్లెట్లకు ఇచ్చే గౌరవం వేరని సూర్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు 2028 నాటికి పూర్తి స్థాయిలో రాటుదేలుతారు. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. 2026 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌గా, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు.
భారత జట్టు ఫామ్ చూస్తుంటే 2028లో కూడా మనదే హవా కొనసాగేలా కనిపిస్తోంది.

