Suryakumar Yadav vs Shreyas Iyer: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. 2026లో భారత్‌కు మెగా కప్‌ను అందించిన 'స్కై'ని కాదని, ఇప్పుడు బోర్డు చూపు శ్రేయస్ అయ్యర్ వైపు మళ్లింది.

రోహిత్ శర్మ తర్వాత టీ20 పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్‌గా సక్సెస్ అయినా.. బ్యాటర్‌గా మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఒకప్పుడు 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను భయపెట్టిన మిస్టర్ 360 డిగ్రీస్.. నాయకత్వ ఒత్తిడి వల్ల తన సహజ సిద్ధమైన ఆటను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పరుగుల వేటలో సూర్య వెనకబడటం బోర్డును తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే అతడిని బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు సూర్య వయసు కూడా బోర్డుకు అడ్డంకిగా మారింది. 2028లో జరగబోయే టీ20 వరల్డ్ కప్, అలాగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. దీర్ఘకాలం జట్టును నడిపించే యువ నాయకుడి కోసం వేట మొదలైంది. జట్టులో హార్దిక్ పాండ్యా లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను అద్భుతంగా నడిపిస్తూ దుమ్మురేపుతున్న శ్రేయస్ అయ్యర్ వైపు బోర్డు మొగ్గు చూపుతోంది.

శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ ఫామ్ అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. మెగా లీగ్ ముగిసిన వెంటనే కెప్టెన్సీ మార్పు సాఫీగా జరిగేలా బీసీసీఐ ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. యువ రక్తాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story