త్వరలోనే స్మృతి మంధాన, పలాశ్‌ ముచ్చల్‌ పెళ్లి!

Smriti Mandhana and Palash Muchhal’s Wedding: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్‌ల వివాహ వేడుకకు సంబంధించిన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పెళ్లి ముహూర్తానికి కొద్ది గంటల ముందు స్మృతి తండ్రికి గుండెపోటు వంటి లక్షణాలు కనిపించడంతో, మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సిన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.స్మృతి తండ్రి ఆరోగ్యం, పెళ్లి వాయిదా పడటం వంటి ఒత్తిడి కారణంగా వరుడు పలాష్ ముచ్చల్ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆయన కూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మృతి తండ్రి, పలాష్ ముచ్చల్ ఇద్దరూ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పలాష్‌ను మొదట సాంగ్లీలోని ఆసుపత్రిలో చేర్చగా, తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. వివాహ వేడుకల భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు చెలరేగుతున్నాయి. అయితే, పలాష్ తల్లి అమిత ముచ్చల్ మాత్రం పెళ్లి త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడిన అమిత... "స్మృతి, పలాష్ ఇద్దరూ బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారుఅని అంగీకరించారు. పెళ్లి రోజున జరిగిన సంఘటన వారిని ఎంతగానో కలచివేసిందని ఆమె తెలిపారు. పలాష్ తన పెళ్లికూతురిని ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు. నేను కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేశాను... అంతా బాగానే ఉంటుంది. పెళ్లి చాలా త్వరగా జరుగుతుందని అమిత ధీమా వ్యక్తం చేశారు. స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లి సంబంధిత పోస్టులన్నింటినీ తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. అయితే, ఈ వాయిదా కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే అని రెండు కుటుంబాల సభ్యులు స్పష్టం చేశారు. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ జెమీమా రొడ్రిగ్స్ ఈ కష్ట సమయంలో స్మృతికి అండగా ఉండటానికి ఉద్దేశంతో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకోవడం వెనుక తెర వెనుక ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story