T20 Cricket: ఒకే ఇన్నింగ్స్ లో 9 వికెట్లు.. బ్రెజిల్ బౌలర్ వరల్డ్ రికార్డ్
బ్రెజిల్ బౌలర్ వరల్డ్ రికార్డ్

T20 Cricket: ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్.. తొమ్మిది వికెట్లు! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, బ్రెజిల్ విమెన్స్ ఫాస్ట్ బౌలర్ లారా కార్డోసో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచ రికార్డును తిరగరాసింది!
కలహరి టీ20 టోర్నీలో భాగంగా లెసోతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కార్డోసో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడింది. కేవలం 3 ఓవర్లు వేసి, కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఏకంగా 9 వికెట్లు పడగొట్టింది! ఇందులో ఒక మెరుపు హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం.
రెండో ఓవర్లోనే హ్యాట్రిక్ తీసి లెసోతో నడ్డి విరిచిన కార్డోసో.. నాలుగో ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆరో ఓవర్లో మరో రెండు వికెట్లు తీసి, క్రికెట్ ప్రపంచంలో మెన్స్ మరియు విమెన్స్ విభాగాల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో 'నైన్ వికెట్ హాల్' తన ఖాతాలో వేసుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రెజిల్, మోనికే మచాడో (69*) రాణించడంతో 202 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో కార్డోసో దెబ్బకు లెసోతో జట్టు కేవలం 13 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో బ్రెజిల్ 189 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.గతంలో భూటాన్ బౌలర్ సోనమ్ యెషీ (8 వికెట్లు), ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా పేరిట ఉన్న రికార్డులను లారా కార్డోసో తుడిచిపెట్టేసింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా ఈ బ్రెజిల్ వండర్ గర్ల్ గురించే మాట్లాడుకుంటోంది!

