T20 World Cup 2026: టీమిండియా ఖాతాలోకి రూ.25 కోట్లు
ఖాతాలోకి రూ.25 కోట్లు

T20 World Cup 2026: టీమ్ ఇండియా ఇటీవల సాధించిన ICC టీ20 వరల్డ్ కప్ 6 విజయానికి గాను ఐసీసీ (ICC) భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.ఛాంపియన్‌గా నిలిచిన భారత్ ఖాతాలోకి దాదాపు రూ. 25 కోట్లు ($2.63 మిలియన్లు) చేరనున్నాయి.
భారత్ కు సుమారు రూ. 25 కోట్లు ($2,639,423). న్యూజిలాండ్ (రన్నరప్) కు సుమారు రూ. 13 కోట్లు ($1,422,692), సెమీఫైనలిస్ట్‌లు సౌత్ ఆఫ్రికాకు రూ. 9.24 కోట్లు, ఇంగ్లాండ్‌కు రూ. 8.96 కోట్లు లభించాయి. ఐసీసీ ఈ టోర్నీ కోసం రికార్డు స్థాయిలో $11.25 మిలియన్ల (దాదాపు రూ. 100 కోట్లు) నిధిని కేటాయించింది.కేవలం ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టు అద్భుత ప్రదర్శనకు మెచ్చి రూ. 131 కోట్ల భారీ నగదు బహుమతిని BCCI సెక్రటరీ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్‌కు పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఆటగాడికి సుమారు రూ. 6 కోట్లు అందే అవకాశం ఉంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి (మొత్తం మీద మూడోసారి) టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సంజూ శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు.

