రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విక్టరీ

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా స్కోరు 20 ఓవర్లలో 187/6 (ర్యాన్ రికెల్టన్ 61, క్వింటన్ డికాక్ 59). చేసింది. టార్గెట్ బరిలో ఆఫ్ఘనిస్తాన్19.4 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెహ్మానుల్లా గుర్బాజ్ 84 పరుగులతో సౌతాప్రికా బౌలర్లకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్‌లో నాటకీయ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ కావడంతో స్కోర్లు సమమై, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

మొదటి సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు, దక్షిణాఫ్రికా17 ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంతో టై అయింది. రెండో సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ & ట్రిస్టన్ స్టబ్స్ రెండో సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాది 23 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండో సూపర్ ఓవర్లో గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి గెలిపించినంత పని చేశాడు, కానీ ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో అవుట్ అయ్యాడు.

ఆఫ్ఘనిస్తాన్19 పరుగులు మాత్రమే చేయడంతో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది.మ్యాచ్ మొత్తంలో 3 వికెట్లు తీసి, మొదటి సూపర్ ఓవర్ కూడా వేసిన ఎంగిడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపరుచుకోగా, ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story