సెమీస్ కు ఇంగ్లాండ్

T20 World Cup 2026: కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ పై ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 159/7 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (39), టీమ్ సీఫెర్ట్ (35) రాణించారు. టార్గెట్ బరిలో ఇంగ్లాండ్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 18వ ఓవర్‌లో విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ కలిసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో 22 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గు చూపింది. విల్ జాక్స్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (32* పరుగులు,2 వికెట్లు) ఇంగ్లాండ్‌ను గెలిపించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ సూపర్ 8 దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, గ్రూప్-2 నుండి సెమీ ఫైనల్‌కు మొదటి జట్టుగా అర్హత సాధించింది. ఇంగ్లాండ్ గెలవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇవాళ జరగబోయే శ్రీలంకతో మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ తేడాతో గెలిస్తే, నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్‌‌ చేస్తే పాకిస్తాన్ 64 రన్స్ తేడాతో నెగ్గాలి. ఛేజింగ్‌‌ చేయాల్సి వస్తే 13.1 ఓవర్లలోనే టార్గెట్‌‌ను పూర్తి చేయాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా.. పాక్‌‌ ఓడినా న్యూజిలాండ్‌‌ సెకండ్ ప్లేస్‌‌తో సెమీస్ చేరి కోల్‌‌కతాలో ఫస్ట్ సెమీఫైనల్ ఆడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story