ఆఖరి బెర్త్ పాకిస్తాన్ దే

T20 World Cup 2026: కొలంబోలో జరిగిన గ్రూప్-A కీలక మ్యాచ్‌లో నమీబియాపై 102 పరుగుల భారీ విజయం సాధించడంతో పాకిస్తాన్ సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది.ఈ విజయంతో పాకిస్తాన్ తన నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా, పాయింట్ల పట్టికలో రెండవ స్థానంతో తర్వాతి రౌండ్‌కు చేరుకుంది.

పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 57 బంతుల్లోనే అజేయమైన సెంచరీ (100)* సాధించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాక్ తరపున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఫర్హాన్ సెంచరీకి తోడుగా సల్మాన్ అఘా (38), షాదాబ్ ఖాన్ (36*) రాణించడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, పాక్ స్పిన్నర్ల ధాటికి తలవంచింది. ముఖ్యంగా ఉస్మాన్ తారీఖ్ (4/16) ,షాదాబ్ ఖాన్ (3/19) వికెట్లతో చెలరేగడంతో నమీబియా కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

సూపర్-8లో పాకిస్తాన్ గ్రూప్-2లో చోటు సంపాదించుకుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఇంగ్లాండ్ ,న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ విజయంతో అమెరికా (USA) జట్టు టోర్నీ నుండి నిష్క్రమించగా, గ్రూప్-A నుండి భారత్ ,పాకిస్తాన్ జట్లు సూపర్-8కు వెళ్లాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story