అమెరికాపై పాకిస్తాన్ విజయం

T20 World Cup 2026: కొలంబో వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్-A మ్యాచ్‌లో పాకిస్తాన్ 32 పరుగుల తేడాతో అమెరికా (USA) పై విజయం సాధించింది. 2024 వరల్డ్ కప్‌లో అమెరికా చేతిలో ఎదురైన పరాజయానికి పాక్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 41 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి పాక్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బాబర్ అజామ్ 32 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. షాదాబ్ ఖాన్ చివర్లో మెరుపులు మెరిపిస్తూ 12 బంతుల్లోనే 30 పరుగులు జోడించాడు. బౌలింగ్‌లో అమెరికా బౌలర్ వాన్ షాల్క్‌విక్ 4 వికెట్లతో రాణించాడు.

టార్గెట్ బరిలోకి దిగిన అమెరికా తరపున శుభమ్ రంజనే (51),షాయన్ జహంగీర్ (49) గట్టిగా పోరాడినప్పటికీ, పాక్ స్పిన్నర్ల ధాటికి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ అద్భుతమైన స్పెల్‌తో 3 వికెట్లు (3/27) పడగొట్టి అమెరికాను దెబ్బతీశాడు. షాదాబ్ ఖాన్ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు.

తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు ఈ అవార్డు లభించింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ గెలుపుతో పాకిస్తాన్ గ్రూప్-A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story