టీమిండియా చెత్త ఫీల్డింగ్

T20 World Cup 2026: ప్రస్తుతం జరుగుతున్న 2026 T20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఫీల్డింగ్ ప్రదర్శన విమర్శలకు గురవుతోంది. ముఖ్యంగా క్యాచ్‌లు జారవిడవడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు 13 క్యాచ్‌లను జారవిడిచింది. సూపర్-8 దశకు చేరుకున్న జట్లలో మరే ఇతర జట్టు ఇన్ని క్యాచ్‌లు వదిలేయలేదు.భారత్ క్యాచ్ పట్టే సామర్థ్యం (Catching Efficiency) కేవలం 72.7% మాత్రమే ఉంది. ఇది సూపర్-8లోని మిగిలిన జట్ల కంటే చాలా తక్కువ. వెస్ట్ ఇండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెండు కీలకమైన క్యాచ్‌లను (రోస్టన్ చేజ్, రోవ్‌మన్ పావెల్) జారవిడిచాడు. అలాగే తిలక్ వర్మ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు.రానున్న మ్యాచుల్లో ఇదే కంటిన్యూ అయితే వరల్డ్ కప్ సాధించాలనే ఆశలు వదులుకోవాల్సిందే అని చెబుతున్నారు.

పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కూడా టీమ్ఇండియా ఫీల్డర్లు ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేశారు.జట్టుక్యాచ్ ఎఫిషియెన్సీఇంగ్లాండ్87.2%జింబాబ్వే85.4%వెస్ట్ ఇండీస్84.6%పాకిస్థాన్83.3%భారత్72.7% జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండటం, ఒత్తిడిలో వారు తడబడుతున్నట్లు కనిపిస్తోంది. సులువైన క్యాచ్‌లను కూడా నేలపాలు చేయడంపై ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ శిక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని మైదానాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్యాచ్‌లు పట్టడం ఇబ్బందిగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.సెమీ ఫైనల్స్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పిదాలు జరిగితే టీమ్ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story