T20 World Cup 2026: జింబాబ్వేపై విండీస్ 'పంజా': 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ జట్టు ఆగుతలేదు. సోమవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేను ఏకంగా 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో విండీస్ జట్టు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు (254/6) నమోదు చేసి రికార్డు సృష్టించింది.
సిక్సర్ల వర్షం.. ఫోర్ల వరద:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ప్లేయర్లు జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. మొత్తం ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు, 16 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా హెట్మెయర్ కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా కెప్టెన్ పావెల్ కూడా 35 బంతుల్లో 59 రన్స్ చేసి మెరిశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగులు జోడించడం విశేషం. 2007లో శ్రీలంక చేసిన 260 పరుగుల రికార్డును విండీస్ కొంచెం తృటిలో మిస్ చేసుకుంది.
హెట్మెయర్ జోరు.. జింబాబ్వే బేజారు:
హెట్మెయర్ ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన టీమ్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తిరగరాశాడు. నిజానికి జింబాబ్వే ఫీల్డర్లు అతనికి రెండుసార్లు లైఫ్ ఇచ్చారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న హెట్మెయర్.. హెల్మెట్ కూడా పెట్టుకోకుండా జింబాబ్వే బౌలర్లను చితక్కొట్టాడు. ఆఖర్లో రూథర్‌ఫర్డ్, హోల్డర్ కూడా వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది.
కుప్పకూలిన జింబాబ్వే:
255 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే.. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. అకీల్ హొస్సేన్ తన స్పెల్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. ఆ తర్వాత గుడకేష్ మోతీ 4 వికెట్లతో చెలరేగడంతో జింబాబ్వే 147 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రాడ్ ఈవాన్స్ (43) ఒక్కడే కాసేపు పోరాడాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వెస్టిండీస్‌కు బాగా అ కలిసివచ్చినట్టుంది.

