ఓడినా ఇంగ్లాండ్ ను వణికించారు

T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో నిన్నముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో నేపాల్ జట్టు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది. పటిష్టమైన ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించి, కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 184/7 పరుగులు చేసింది.టార్గెట్ బరిలో నేపాల్ 20 ఓవర్లలో 180/6 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (53), జాకబ్ బెథెల్ (55) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో విల్ జాక్స్ (39)* మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏ దశలోనూ తగ్గలేదు. దీపేంద్ర సింగ్ ఐరీ (44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39) రాణించగా, చివర్లో లోకేశ్ బామ్ (39)* కేవలం 20 బంతుల్లోనే మెరుపులు మెరిపించి విజయం అంచులకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో నేపాల్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా, సామ్ కరన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు.

ఓడిపోయినప్పటికీ, ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను వణికించిన నేపాల్ ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story