T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్: ఇవాళ నమీబియాతో ఇండియా మ్యాచ్
ఇవాళ నమీబియాతో ఇండియా మ్యాచ్

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా తన రెండో మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ ఉత్కంఠభరిత పోరుకు వేదిక కానుంది. రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫుడ్ ఇన్ఫెక్షన్ (కడుపు నొప్పి) కారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాదు. అయితే అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది డౌటే. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. జ్వరం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. అతను మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది.
గాయం నుంచి కోలుకున్న సుందర్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
మొదటి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాపై కూడా గెలిచి తన విజయపరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే భారీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు ఇదొక మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, సూర్యకుమార్ యాదవ్ నుండి మరో భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు.
జట్లు (అంచనా):
ఇండియా: అభిషేక్ శర్మ / సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా / సిరాజ్, వరుణ్ చక్రవర్తి.
నమీబియా: లారెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రీలింక్, జాన్ నికోల్ లోఫ్టి ఈటన్, గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, జాన్ గ్రీక్, డైలాన్ లీచెర్, విలియమ్ మైబర్గ్ , రూబెన్ ట్రూపెల్మ్‌న్, బెర్నార్డ్ స్కూల్జ్, బెన్ షికాంగో.

