టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

T20 World Cup Schedul: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఈ రోజు (నవంబర్ 25, మంగళవారం) సాయంత్రం విడుదల కానుంది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ షెడ్యూల్‌ను సాయంత్రం 6:30 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారికంగా ప్రకటించనుంది. టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే అవకాశం ఉంది. క్రికెట్ ప్రపంచం ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తేదీ ఈరోజు ఖరారయ్యే అవకాశం ఉంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు మళ్లీ ఒకే గ్రూప్‌లో (గ్రూప్-ఎ) ఉన్నట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, పాకిస్తాన్ ఆడే గ్రూప్ మ్యాచ్‌లు అన్నింటినీ భారత్‌లో కాకుండా శ్రీలంకలోని కొలంబో వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐసీసీ నిర్ణయించింది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే, పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌ను కొలంబోకు తరలించే అవకాశం ఉంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వీటిని ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఎ: భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.

గ్రూప్-బి: శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story