భారత్,పాక్ మ్యాచ్ ఎపుడంటే.?

T20 World Cup Schedule: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల అయింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2026లో భారత్ ,శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్‌ను నవంబర్ 25న విడుదల చేసింది.

టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్ లోని 5 వేదికలు, శ్రీలంక లోని 3 వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్‌లోని అహ్మదాబాద్, ముంబై, న్యూ ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ఫైనల్ వేదిక నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (పాకిస్థాన్ ఫైనల్‌కు చేరితే కొలంబోకు మారుతుంది) లో మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించారు.

టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.

భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story