T20 World Cup: టీ20 ప్రపంచకప్ .. జింబాబ్వే జట్టు ఇదే!
జింబాబ్వే జట్టు ఇదే!

T20 World Cup: ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనున్న మెగా టోర్నీ కోసం జింబాబ్వే సెలక్టర్లు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన సమతుల్య జట్టును ఎంపిక చేశారు. జట్టు పగ్గాలను వెటరన్ స్టార్ సికిందర్ రజాకే అప్పగించారు. గాయం నుండి కోలుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ జట్టులోకి తిరిగి రావడం జింబాబ్వేకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
జింబాబ్వే పేస్ విభాగానికి ముజారబానీ నాయకత్వం వహించనుండగా, రిచర్డ్ నగారవా అతనికి తోడుగా నిలవనున్నారు. బ్రాడ్లీ ఎవాన్స్, టినోటెండా మాపోసా పేస్ దళానికి మరింత లోతును చేకూర్చనున్నారు. స్పిన్ విభాగంలో వెటరన్ స్పిన్నర్ గ్రేమ్ క్రీమర్ రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆయన వెల్లింగ్టన్ మసకద్జాతో కలిసి ప్రత్యర్థిని కట్టడి చేయనున్నారు.
బ్యాటింగ్‌లో అనుభవం కలిగిన బ్రెండన్ టేలర్ టాప్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. యువ బ్యాటర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి తమ మెరుపులతో ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఆల్ రౌండర్ రయాన్ బర్ల్ తన పవర్ హిట్టింగ్, లెగ్ స్పిన్‌తో జట్టులో సమతుల్యతను తీసుకురానున్నారు.
ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్-బిలో చోటు సంపాదించుకుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, సహ-ఆతిథ్య దేశం శ్రీలంక ఉన్నాయి.
ఫిబ్రవరి 9: ఒమన్‌తో తొలి మ్యాచ్ (కొలంబో)
ఫిబ్రవరి 13: ఆస్ట్రేలియాతో కీలక పోరు (కొలంబో)
ఫిబ్రవరి 17: ఐర్లాండ్‌తో తలపడనుంది (క్యాండీ)
ఫిబ్రవరి 19: శ్రీలంకతో చివరి గ్రూప్ మ్యాచ్ (కొలంబో)
జింబాబ్వే జట్టు: సికిందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, రయాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మాపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తాషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగారవా, బ్రెండన్ టేలర్.

