టీమిండియా ఎంపిక

Asia Cup Hockey: 2025 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌ కోసం హాకీ ఇండియా 18 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్గిర్ హాకీ స్టేడియంలో జరగనుంది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా, హార్దిక్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ టోర్నమెంట్ FIH హాకీ వరల్డ్ కప్ బెల్జియం-నెదర్లాండ్స్ 2026కి క్వాలిఫయర్‌గా కూడా పనిచేస్తుంది. భారత జట్టు కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ మాట్లాడుతూ, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో రాణించగల అనుభవం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశామని తెలిపారు. జట్టులో సమతుల్యం, నాయకత్వం, ప్రతి విభాగంలో ఉన్న నాణ్యతతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.

భారత జట్టువివరాలు

గోల్ కీపర్స్

కృషన్ బి పాఠక్

సూరజ్ కర్కేరా

డిఫెండర్లు:

సుమిత్

జర్మన్‌ప్రీత్ సింగ్

సంజయ్

హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్)

అమిత్ రోహిదాస్

జుగ్‌రాజ్ సింగ్

మిడ్‌ఫీల్డర్లు:

రాజిందర్ సింగ్

రాజ్ కుమార్ పాల్

హార్దిక్ సింగ్ (వైస్-కెప్టెన్)

మన్ ప్రీత్ సింగ్

వివేక్ సాగర్ ప్రసాద్

ఫార్వర్డ్‌లు:

మన్దీప్ సింగ్

శిలానంద్ లక్రా

అభిషేక్

సుఖ్‌జీత్ సింగ్

దిల్‌ప్రీత్ సింగ్

రిజర్వ్ ఆటగాళ్లు:

నీలం సంజీప్ క్సెస్

సెల్వం కార్తీ

PolitEnt Media

PolitEnt Media

Next Story