క్రికెట్ లో 80 శాతం సక్సెస్ రేట్

Team India Captain Suryakumar Yadav (SKY): సూర్యకుమార్ యాదవ్, ముద్దుగా SKY అని పిలుచుకునే ఈ ఆటగాడు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, కెప్టెన్‌గా కూడా అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తూ టీమిండియాను విజయపథంలో నడిపిస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్ (SKY) నాయకత్వంలో టీమిండియా టీ20ల్లో విజయాలతో దూసుకుపోతోంది.తాజా గణాంకాల ప్రకారం కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే:

సూర్యకుమార్ కెప్టెన్సీ రికార్డు టీ20ల్లో మొత్తం 52 మ్యాచుల్లో 42 గెలిస్తే..8 మ్యాచుల్లో ఓటమి పాలైంది. రెండింటిలో ఫలితం తేలలేదు. విన్నింగ్ పర్సంటేజ్ 80.77 శాతంగా ఉంది.

ఇటీవల జరిగినటీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజీలాండ్‌ను ఓడించి భారత్‌కు ట్రోఫీని అందించారు. : పాకిస్తాన్‌పై విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిపారు. టీ20ల్లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ (80% పైగా) ఉన్న కెప్టెన్‌గా రోహిత్ శర్మ (80.65%) రికార్డును సూర్య అధిగమించారు. సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను స్కూల్, కాలేజీల్లో ఎప్పుడూ 50-60% మార్కులు కూడా దాటలేదు, కానీ క్రికెట్‌లో ఈ 80% స్కోరు సాధించడం చాలా ఆనందంగా ఉంది"అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్‌ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు. సూర్య నాయకత్వంలో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే, మరిన్ని ఐసీసీ ట్రోఫీలు రావడం ఖాయం అనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story