గంభీర్ కీలక సూచనలు

Team India head coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు ఇచ్చిన కీలక సూచనలు చేశారు. దేశం తరపున ఆడే ఆటగాళ్లు కచ్చితంగా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలి. గాయాల నుండి కోలుకున్న తర్వాత మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ఆడాల్సిందేనని స్పష్టం చేశారు.జట్టు ప్రయోజనమే ముఖ్యం, కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి ఇది ఒకరి ఆట కాదని, జట్టు ప్రయోజనాలకే అంతిమంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

జట్టు ఇంకా అనుకున్న స్థాయికి చేరుకోలేదని, 'పర్ఫెక్ట్ గేమ్' ఆడలేదని స్పష్టం చేశారు. మెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అని, గత విజయాలపై సంతృప్తి చెందకూడదని సూచించారు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లకు, ముఖ్యంగా యువ ఆటగాళ్లకు, పరుగుల గురించి ఆలోచించకుండా, నిరాశ పడకుండా తమ సహజమైన ఆట ఆడాలని సలహా ఇచ్చారు.టీ20 క్రికెట్‌లో ఫియర్లెస్ (నిర్భయ) ఆట అవసరమని, అదే సమయంలో తెలివిగా ఆడటం కూడా ముఖ్యమని చెప్పారు. "ఒక దేశంగా, ఒక వ్యక్తిగా, మనం ఎప్పుడూ, ఎప్పుడూ ఒక సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోకూడదని గట్టి సందేశం ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story