Team India head coach Gautam Gambhir: జడేజా టీమిండియాలో ఉండడం అదృష్టం
టీమిండియాలో ఉండడం అదృష్టం

Team India head coach Gautam Gambhir: టీమిండియా ఆల్ రౌండర్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో జడేజా అద్భుతమైన పోరాటం చేశాడని మెచ్చుకున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికీ, రవీంద్ర జడేజా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచి గొప్ప పోరాటం చేశాడు. కేవలం 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినప్పుడు, జడేజా బ్యాట్స్‌మెన్‌లతో కలిసి పట్టుదలగా నిలబడి చివరి వరకు పోరాడారు. అతని ఈ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో విలువైనదని గంభీర్ అన్నారు.
బిసిసిఐ (BCCI) విడుదల చేసిన ఒక వీడియోలో, గంభీర్ మాట్లాడుతూ, అదొక అసాధారణ పోరాటం. జడ్డూ చూపిన పోరాటం నిజంగా అద్భుతం అని ప్రశంసించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో టీమ్‌ని ఉద్దేశించి మాట్లాడిన గంభీర్, జడేజా నిస్వార్థ ఆటతీరును, ఒత్తిడిలో అతను చూపిన సంకల్పాన్ని కొనియాడారు. మా జట్టులో అలాంటి ఆటగాడు ఉండటం మా అదృష్టం. జట్టు కోసం అతను ప్రతి కీలక సమయంలో పరుగులు చేస్తాడు. అని గంభీర్ అన్నారు.
రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ - మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని, జట్టుకు ఎంతో కీలకం అని గంభీర్ అంతకుముందు కూడా ప్రశంసించారు. లార్డ్స్ టెస్టులో జడేజా ఇన్నింగ్స్ అతని అంకితభావాన్ని, జట్టు పట్ల అతని విలువను మరోసారి నిరూపించిందని గంభీర్ అభిప్రాయపడ్డారు.
