తొలిరోజు స్కోర్ ఎంతంటే.?

Team India in Trouble: ఇండియా , ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడింది. మొత్తం 64 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు.

టాస్‌‌‌‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. యువ ఓపెనర్ సాయి సుదర్శన్ 38 పరుగులతో రాణించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. గిల్‌‌‌‌ రనౌట్‌‌‌‌తో ఇండియా 83/3తో మరిన్ని కష్టాల్లో పడింది. తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌లలో కరుణ్ నాయర్ (52* పరుగులు) , వాషింగ్టన్ సుందర్ (19* పరుగులు) అజేయంగా నిలిచారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో గుస్ అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఒక టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌ చేసిన ఇండియా తొలి కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (743). గావస్కర్‌‌‌‌ (732) రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. ఓవరాల్‌‌‌‌గా డాన్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌మన్‌‌‌‌ (810), గ్రాహం గూచ్‌‌‌‌ (752) ముందున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story