టీమిండియా

Team India Meets the President: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 విజేతలుగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిసింది.భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల జరిగిన 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారిగా గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయం తర్వాత, టీమ్ ఇండియా (కోచ్ అమోల్ మజుందార్‌తో సహా)ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్మును కలిసింది.

ఈ సందర్భంగా వరల్డ్ కప్ విశేషాలను ప్లేయర్లు పంచుకున్నారు. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి.. భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్లేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. ఈ విజయం భారతదేశ ఆడబిడ్డల సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిందని, ఇది దేశం గర్వించదగిన క్షణమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలవడానికి ముందు, భారత మహిళల క్రికెట్ జట్టు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి ఆయన అభినందనలు అందుకుంది. భారత మహిళల క్రికెట్‌లో ఇది ఒక చారిత్రక ఘట్టం.

PolitEnt Media

PolitEnt Media

Next Story