టీమిండియా ఘనవిజయం

T20 World Cup: సరిహద్దు ఏదైనా.. సమరం ఏదైనా.. పాకిస్తాన్‌పై మన అమ్మాయిలదే పైచేయి. విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సాంప్రదాయ ప్రత్యర్థి పాక్‌ను 64 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మన టీమ్ మొదట్లో కష్టాల్లో పడినా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. 44 బంతుల్లో 68 రన్స్ కొట్టి పాక్ బౌలర్లను ఆడేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 రన్స్‌తో అండగా నిలిస్తే.. చివర్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 రన్స్‌తో మెరుపులు మెరిపించింది. దీంతో ఇండియా 20 ఓవర్లలో 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇక ఛేజింగ్‌లో పాకిస్తాన్‌కు మన బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్ మాంత్రికుడు దీప్తి శర్మ కేవలం 10 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ నడుం విరిచింది. శ్రీచరణి 3 వికెట్లతో అదరగొట్టింది. దీంతో పాక్ టీమ్ కేవలం 106 రన్స్‌కే కుప్పకూలిపోయింది.అద్భుతమైన ఆల్‌రౌండ్ షోతో 5 వికెట్లు తీసిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
- India national cricket teamPakistan national cricket teamT20 World CupIndia vs PakistanTeam IndiaPakistan CricketCricket NewsWorld Cup VictoryCricket RivalrySports NewsInternational CricketMatch HighlightsCricket FansTeam India WinCricket TournamentSports UpdatesIndian CricketLatest Cricket NewsLatest Telugu NewsCricket FeverHigh Voltage ClashVictory Celebration

