టీమిండియా గురి..

Team India: భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే నేడు రాజ్‌కోట్‌లో జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (93), శుభ్‌మన్ గిల్ (56) అద్భుత ప్రదర్శన చేశారు.గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోని జట్టులోకి వచ్చాడు.

రాజ్‌కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది, కాబట్టి నేడు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద బలం. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోవడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓపెనర్లు కాన్వే, నికోల్స్ ఇచ్చిన శుభారంభాన్ని మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఉపయోగించుకోలేకపోయింది. దాంతో మిడిల్‌‌‌‌‌‌‌‌ బలోపేతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కివీస్ జట్టులో డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్‌లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), నితీష్ కుమార్ రెడ్డి/ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: మైకేల్‌‌‌‌‌‌‌‌ బ్రేస్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌‌‌‌‌‌‌‌, విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌, డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌ హే, గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌, క్రిస్టియన్‌‌‌‌‌‌‌‌ క్లార్క్‌‌‌‌‌‌‌‌, కైల్‌‌‌‌‌‌‌‌ జెమీసన్‌‌‌‌‌‌‌‌, జాక్‌‌‌‌‌‌‌‌ ఫోక్స్‌‌‌‌‌‌‌‌, ఆదిత్య అశోక్‌‌‌‌‌‌‌‌ / జైడెన్‌‌‌‌‌‌‌‌ లెనాక్స్‌‌‌‌‌‌‌‌

PolitEnt Media

PolitEnt Media

Next Story