టీమిండియా గురి

Team India: ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం టీమిండియా 2–1 ఆధిక్యంలో ఉంది. మూడో టీ20లో ఐదు రన్స్‌‌‌‌ స్వల్ప తేడాతో ఓడిన ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌లో ప్రధానంగా బ్యాటర్లపై దృష్టి పెట్టనుంది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. స్మృతి మంధాన, జెమీమా, అమన్‌‌‌‌జోత్‌‌‌‌ కౌర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story