Team India Sweats It Out in Intense Practice Session: దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు, టీమ్ఇండియా నిన్నరాంచీలో చురుగ్గా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది.నవంబర్ 30న (ఆదివారం) రాంచీ వేదికగానే తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో, ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.

టెస్ట్ సిరీస్‌కు దూరమైన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ జట్టులో తిరిగి చేరడంతో ప్రాక్టీస్ సెషన్‌కు మరింత జోష్ వచ్చింది. వీరిద్దరూ కలిసి నెట్స్‌లో గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. . అయితే హిట్‌మ్యాన్ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. AUS సిరీస్‌తో పోల్చితే మరింత ఫిట్‌గా తయారయ్యారని SMలో పోస్టులు పెడుతున్నారు. వన్డే WC గెలవడమే లక్ష్యంగా రోహిత్ ఫిట్‌నెస్‌ గోల్ సెట్ చేసుకున్నారని అంటున్నారు. కుర్రాడిలా మారిపోయారని కామెంట్లు పెడుతున్నారు.

శుభ్ మన్ గిల్ గాయపడటం, శ్రేయస్ అయ్యర్ దూరమవడం వలన ఈ సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్న కేఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్‌లో చురుగ్గా కనిపించాడు. రాంచీకి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంటిని విరాట్ కోహ్లీ సందర్శించడం కూడా ఈ సందర్భంగా వైరల్ అయింది.టెస్ట్ సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్ అయిన తర్వాత, వన్డే సిరీస్‌లో గెలిచి మళ్లీ ఫామ్‌లోకి రావాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. సీనియర్ల రాకతో జట్టు కాన్ఫిడెన్స్ పెరిగింది. నవంబర్ 30 రాంచీలో మొదటి వన్డే, డిసెంబర్ 3 రాయ్‌పూర్ లో రెండో వన్డే, డిసెంబర్ 6 న విశాఖపట్నలో మూడో వన్డే జరగనుంది.

Next Story