రెండో టెస్ట్ ఆడతాడా.?

Team India Test Captain Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా మెడ కండరాలు పట్టేయడం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.నవంబర్ 16న కోల్‌కతాలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఆయన ప్రస్తుతం కోల్‌కతాలోని టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మెడ గాయం నుంచి కోలుకుంటున్నారు.

వైద్యులు గిల్‌కు కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని, అలాగే కోలుకునే సమయంలో విమాన ప్రయాణాలు చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది.

నవంబర్ 22న గువాహటిలో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.విమాన ప్రయాణాలు చేయకూడదని వైద్యులు సూచించడం వల్ల, బుధవారం గువాహటి వెళ్లాల్సిన జట్టుతో ఆయన ప్రయాణించే అవకాశం తక్కువగా ఉంది.జట్టు ఫిజియో గిల్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, ఆయన అందుబాటుపై తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది.శుభ్‌మన్‌ గిల్ రెండో టెస్ట్‌కు దూరమైతే, జట్టు కెప్టెన్సీని రిషబ్ పంత్ స్వీకరించే అవకాశం ఉంది.

తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. గౌహతి టెస్టుల్పో గెలిస్తేనే ఇండియా సిరీస్ సమం చేసుకుంటుంది. లేకపోతే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెనకపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story