దుబాయ్ కు టీమిండియా..

Team India: 2025 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 4న దుబాయ్ బయలుదేరనుంది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి, వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. భారత జట్టు పాకిస్తాన్, యుఎఇ, ఒమన్ జట్లతో కలిసి గ్రూప్-ఎలో ఉంది.

ఈ టోర్నమెంట్ 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. దీనివల్ల ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు.

ఆసియా కప్ కు భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్

సెప్టెంబర్ 10: భారత్ vs యుఎఇ, దుబాయ్

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్, అబుదాబి

PolitEnt Media

PolitEnt Media

Next Story