Team India to Tour Bangladesh: సెప్టెంబ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా
బంగ్లాదేశ్ కు టీమిండియా

Team India to Tour Bangladesh: టీమిండియా సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.వన్డే సిరీస్ (ODI)సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో ఆడనుంది. అదే నెలలో 9, 12, 13 తేదీల్లో మూడు టీ20 లు ఆడనుంది. నిజానికి ఈ సిరీస్ 2025లోనే జరగాల్సి ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో అప్పట్లో నెలకొన్న రాజకీయ అస్థిరత మరియు అల్లర్ల కారణంగా దీనిని వాయిదా వేశారు.
2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఆ సమయంలో జరిగిన 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 2025లో జరగాల్సిన భారత పర్యటనను భద్రతా కారణాల దృష్ట్యా 2026కు రీషెడ్యూల్ చేశారు.ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోని ఏ స్టేడియాల్లో జరుగుతాయనేది త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.ప్రస్తుతానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ తేదీలను ప్రకటించింది, అయితే అప్పటి పరిస్థితులను బట్టి బీసీసీఐ (BCCI) తుది నిర్ణయం తీసుకోనుంది.

