గొప్ప బహుమతి

Team India veteran spinner Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఇషాన్ కిషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.ఇటీవల టీ20 వరల్డ్ కప్ కు ఇషాన్ ఎంపిక కావడంపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రస్తావించారు.

ఇషాన్ కిషన్ కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా, డొమెస్టిక్ క్రికెట్‌లో (బుచ్చి బాబు టోర్నీ, దులీప్ ట్రోఫీ) కష్టపడి ఆడి మళ్ళీ ఫామ్‌లోకి రావడం, జట్టులోకి ఎంపికవ్వడం అనేది అతను క్రికెట్ పట్ల చూపిన అంకితభావానికి దక్కిన ప్రతిఫలమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కుంగిపోకుండా, మళ్ళీ మైదానంలోకి వచ్చి పరుగులు సాధించడం ఇషాన్‌కు క్రికెట్ ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్ల రూపాయలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఎప్పుడూ ఆటగాళ్ల టెక్నిక్ కంటే వారి మానసిక స్థితి (Mindset) గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇషాన్ కిషన్ విషయంలో కూడా అతను పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించిందని అశ్విన్ సారాంశం.

PolitEnt Media

PolitEnt Media

Next Story