ఆధిపత్యం చెలాయించడమే టార్గెట్

Team India vice-captain Smriti Mandhana: మహిళల టీ20 ప్రపంచ కప్‌పై టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయం తర్వాత ఆమె జట్టు లక్ష్యాలను, సన్నద్ధతను పంచుకున్నారు.భారత జట్టు కేవలం ఒకటి రెండు మ్యాచ్‌లు గెలవడం కాదు, ప్రపంచ క్రికెట్‌లో స్థిరంగా అగ్రస్థానంలో ఉంటూ ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎవరిని ఓడించామనేది ఇప్పుడు ముఖ్యం కాదు, ప్రతి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలి" అని మందాన అన్నారు.

2026 జూన్ 12 నుండి ఇంగ్లాండ్ ,వేల్స్‌లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీని గురించి మాట్లాడుతూ, "గత సంవత్సరం వన్డేలపై దృష్టి పెట్టాం, కానీ ఈ ఏడాది పూర్తిగా టీ20 నామ సంవత్సరం. ప్రపంచ కప్ కోసం మా అత్యుత్తమ 11 మంది (Best XI) ఆటగాళ్లను సిద్ధం చేసే పనిలో ఉన్నాం" అని చెప్పారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వల్ల భారత ఆటగాళ్ల టీ20 నైపుణ్యాలు చాలా మెరుగుపడ్డాయని, ఇది ప్రపంచ కప్ సన్నాహాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకమని, ఇది జట్టులో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది. అంతకంటే ముందు స్మృతి మందాన సారథ్యంలోని RCB జట్టు WPL 2026లోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story