స్పోర్ట్స్ ఎరోబిక్స్ విన్నర్ గా తెలంగాణ

National Sports Aerobics Champion: తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటారు. తమిళనాడులోని సేలంలో జరిగిన 3వ నేషనల్ స్పోర్ట్స్ ఎరోబిక్స్ అండ్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్ (2025) లో తెలంగాణ జట్టు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

తెలంగాణ జట్టు మొత్తం 734 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.ఆతిథ్య జట్టు తమిళనాడు 640 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.అండర్-8 నుండి అండర్-24 వరకు వివిధ కేటగిరీల్లో (సోలో, డబుల్స్, ట్రియో, టీమ్ ఈవెంట్స్) తెలంగాణ అథ్లెట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

ముఖ్య విజేతలు

అండర్-8: ఆద్యా షానాకునమ్, పట్నం సోనాక్షి గౌడ్ (గోల్డ్ మెడల్స్).

అండర్-10: బి.సమీక్ష,బి.జ్ఞానవి,జోగి విరాజ్,జోగి వైశ్విక్ బృందం టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.

అండర్-12: ధాన్వీ జోషి (గర్ల్స్ సింగిల్స్ -గోల్డ్).

అండర్-14: జె.ధాత్రి రెడ్డి,ఎస్.సోనాక్షి (సింగిల్స్ -గోల్డ్).

అండర్-24: జి.అపర్ణ (సింగిల్స్ -గోల్డ్).

ఇటీవలే ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025 లో కూడా తెలంగాణ విద్యార్థులు రికార్డు స్థాయిలో 230 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story