ధనుష్ కు ప్రభుత్వం భారీ నజరానా

Telangana Shooter Dhanush: అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ధనుష్ శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ఇరవై లక్షల రూపాయల నజరానా ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. హనుమకొండలోని స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ భారీ నజరానాను ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన క్రీడా విధానం (Sports Policy) ప్రకారం ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు.

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ధనుష్ శ్రీకాంత్ టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్ (Deaflympics)లో భారతదేశం తరపున గోల్డ్ మెడల్ సాధించారు.

ఆదివారం జరిగిన మెన్స్‌‌ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌‌ ఈవెంట్‌‌లో ధనుష్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. ఇండియాకే చెందిన మహ్మద్ ముర్తజా సిల్వర్‌‌‌‌ మెడల్‌‌తో మెరిశాడు.

ధనుష్ శ్రీకాంత్ అద్భుతమైన నైపుణ్యం , క్రీడాస్ఫూర్తితో భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. ధనుష్ శ్రీకాంత్ సాధించిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో, ముఖ్యంగా దివ్యాంగుల క్రీడల్లో, ఒక ముఖ్యమైన ఘట్టం.

PolitEnt Media

PolitEnt Media

Next Story