టీమిండియా ఓటమిపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Former veteran spinner Ravichandran Ashwin: టీమ్ ఇండియా మాజీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో టీ20 ప్రపంచకప్ సూపర్-8లో దక్షిణాఫ్రికాపై భారత్ ఎదుర్కొన్న 76 పరుగుల భారీ ఓటమిపై తనదైన శైలిలో స్పందించారు.అక్షర్ పటేల్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అశ్విన్ తప్పుబట్టారు.

దక్షిణాఫ్రికాలోని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కోసం మేనేజ్‌మెంట్ వాషింగ్టన్‌ను ఎంచుకుంది.

ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లలో మ్యాచ్-అప్‌ల కోసం ఆటగాళ్లను మార్చడం సరైనదే కావచ్చు, కానీ ఐసీసీ టోర్నమెంట్‌లలో జట్టు స్థిరంగా ఉండాలి. అక్షర్ పటేల్ భారత టీ20 జట్టుకు విలువైన ఆటగాడు . గత టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో కూడా అతను కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాంటి అనుభవం ఉన్న ప్లేయర్‌ను పక్కన పెట్టడం పెద్ద తప్పు. ఫినిషర్‌గా పేరున్న రింకూ సింగ్‌ను లో8వ స్థానంలో పంపడం బ్యాటింగ్‌కు పంపడంపై అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు.

లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను 5వ స్థానంలో ప్రమోట్ చేశారు. మీ దగ్గర 8 మంది బ్యాటర్లు ఉన్నప్పుడు, రింకూ సింగ్‌ను 8వ స్థానంలో పంపడం ఏమాత్రం సమంజసం కాదు. అతను కనీసం 5వ స్థానంలో రావాల్సింది. వాషింగ్టన్ సుందర్‌ను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు, కానీ రింకూ వంటి పవర్‌ఫుల్ హిట్టర్‌ను చివర్లో పంపడం వల్ల మ్యాచ్ అప్పటికే చేజారిపోయింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారని, వారిని అడ్డుకోవడానికి ఆఫ్-స్పిన్నర్లను (ఉదాహరణకు వాషింగ్టన్ సుందర్) వాడాలనే వ్యూహం ఫలించలేదని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story