The Destructive Cricketer Andre Russell: చివరి మ్యాచ్ ఆడిన విధ్వంసకర క్రికెటర్
విధ్వంసకర క్రికెటర్

The Destructive Cricketer Andre Russell: ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెస్టిండీ విధ్వసంకర బ్యాట్స్ మెన్ తన చివరి మ్యాచ్ ఆడారు. జులై 22న ఆస్ట్రేలియాతో జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగిన రెండో T20 మ్యాచ్ ఆడి ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన లాస్ట్ మ్యాచ్ లో రస్సెల్ చెలరేగాడు.15 బంతుల్లో 36 రన్స్ చేశాడు.నాలుగు సిక్సులు..రెండు ఫోర్లతో బీభత్సం సృష్టించాడు.అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓటమి పాలైంది.
రస్సెల్ ఒక టెస్ట్ మ్యాచ్ , 56 వన్డే మ్యాచ్‌లలో 1034 పరుగులు, 70 వికెట్లు. 84 టీ20 మ్యాచ్‌లలో 1078 పరుగులు , 61 వికెట్లు ఆడాడు. 2012, 2016లలో ICC T20 ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో కీలక సభ్యుడు.రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ పలు T20 లీగ్‌లలో ఆడనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడుతున్నాడు.
