Rashid Khan: టీ20 చరిత్రలో ఒకే ఒక్కడు.. రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డ్
రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డ్

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక భారీ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో (UAEతో జరిగిన మ్యాచ్), రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించారు.కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే, రషీద్ ఖాన్ ప్రస్తుతం 191 వికెట్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
Rashid Khan: టీ20 ఫార్మాట్‌లో (అంతర్జాతీయ + లీగ్ మ్యాచ్‌లు అన్నీ కలిపి) 700 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రషీద్ చరిత్ర సృష్టించారు. UAE బ్యాటర్ ముహమ్మద్ అర్ఫాన్ వికెట్ తీయడం ద్వారా రషీద్ ఈ ఘనతను అందుకున్నారు. విచిత్రంగా, సదరు బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడబోయి హిట్ వికెట్ (Hit-wicket) అవ్వడం గమనార్హం. కేవలం 518 టీ20 మ్యాచ్‌ల్లోనే ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ అద్భుతమైన ఘనతను సాధించడం విశేషం.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు
1రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ :700
2డ్వేన్ బ్రావో వెస్టిండీస్: 631
3సునీల్ నరైన్ వెస్టిండీస్: 613
4ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా:572
5ఆండ్రీ రస్సెల్వెస్టిండీస్:508

