PV Sindhu’s Viral Post: భర్త క్రీడాభిమాని అయితే ఆ మజానే వేరు: పీవీ సింధు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
పీవీ సింధు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

PV Sindhu’s Viral Post: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు కోర్టులో ఊహించని సాయం లభించింది. ఎప్పుడూ ఆటపైనే ఫోకస్ పెట్టే సింధుకు.. ఈసారి మ్యాచ్ గెలవడంలో ఆమె భర్త వెంకట దత్తసాయి కీలక పాత్ర పోషించారు. వృత్తిరీత్యా స్పోర్ట్స్ డేటా సైంటిస్ట్ అయిన దత్తసాయి.. తన భార్య కోసం కాసేపు కోచ్‌గా మారి, ఆమెలో కొండంత మనోధైర్యాన్ని నింపారు. ఈ విషయాన్ని సింధు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భాగంగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో.. మరో భారత షట్లర్ ఇషారాణి బారువాపై సింధు 22-20, 21-12 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ గెలవడం సింధుకు అంత సులువుగా ఏమీ కాలేదు. మ్యాచ్ సమయంలో తనకు ఎదురైన ఒక ఎమోషనల్ జర్నీని సింధు అభిమానులతో పంచుకుంది.
నాకు ఉదయం నుంచి ఒంట్లో అస్సలు బాగోలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా. ఆ సమయంలో నాకు మానసిక మద్దతు చాలా అవసరం అనిపించింది. అందుకే నాకు తెలిసిన వారిలో అత్యంత గొప్ప ఎనలిస్ట్ అయిన నా భర్తను పిలిచాను. మా ఇద్దరికీ ఒకరే కోచ్ ఉండటంతో.. కోచ్‌ను పిలిచి ఇషాను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దాంతో నా భర్త దత్తసాయికి ప్రమోషన్ ఇచ్చి.. కాసేపు కోచ్‌గా నా పక్కన కూర్చోబెట్టా."నిజం చెప్పాలంటే.. ఆయన నన్ను ఎంతగా ప్రోత్సహించారంటే, 'నాకు వద్దు బాబోయ్' అనేంతగా మోటివేట్ చేశారు. ఈ క్రమంలో రిఫరీ నుంచి రెండు వార్నింగ్‌లు కూడా అందుకున్నాం. కానీ మొత్తానికి కార్డు పడకుండానే ఎలాగోలా బయటపడ్డాం. రెండో గేమ్ నాటికి ప్రత్యర్థి ఆటను సరిగ్గా అంచనా వేసి విజయం సాధించా. భర్త క్రీడాభిమాని అయితే.. కొన్నిసార్లు ఎంతగానో సాయపడుతుంది.భర్త అందించిన ప్రోత్సాహంతో నొప్పినే మర్చిపోయి మ్యాచ్ గెలిచిన సింధు పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

