Rajat Patidar’s Emotional Statement: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి కప్పును ముద్దాడిన మూడో జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కింగ్ కోహ్లీ విశ్వరూపానికి తోడు.. యువ సారథి రజత్ పాటీదార్ వ్యూహాత్మక నైపుణ్యం తోడవడంతో ఆర్సీబీ మళ్లీ ఛాంపియన్‌గా అవతరించింది.

గుజరాత్‌తో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ బౌలింగ్ ఎంచుకున్నాడు. నాకౌట్ స్టేజ్‌లోని గత మూడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్‌కే మొగ్గు చూపగా.. పాటీదార్ మాత్రం ఛేజింగ్ వైపే వెళ్లాడు. ఈ బోల్డ్ డెసిషన్ వెనకున్న సీక్రెట్‌ను మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్వయంగా బయటపెట్టాడు.

రజత్ పాటీదార్ ఏమన్నాడంటే..

వరుసగా రెండోసారి ట్రోఫీని గెలవడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఫైనల్ మ్యాచ్ కోసం ఇక్కడికి రాగానే గతేడాది జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడును కొనసాగించాం. టాస్ గెలిస్తే ఏం చేయాలనే దానిపై మాకు ముందే పూర్తి స్పష్టత ఉంది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువని మాకు తెలుసు. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం.గుజరాత్ టాప్-3 బ్యాటర్లను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుందని ప్లాన్ చేశాం. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించారు. జట్టులోని ప్రతి బౌలర్ ఈ విజయానికి కారణమే. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది, కానీ ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాం.

ప్రి-సీజన్ నుంచే మేం చాలా శ్రమించాం. విరాట్ భాయ్, డీకేల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని నన్ను నేను మెరుగుపర్చుకున్నా. ముఖ్యంగా మైదానంలో విరాట్ కోహ్లీ ఇచ్చే ఎనర్జీ, కొత్త ఆటగాళ్లకు ఆయన ఇచ్చే ధైర్యం అమూల్యమైనవి. ఇక మా అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మేం ఎక్కడికి వెళ్లినా సరే కొండంత అండగా నిలిచారు. అందుకే.. ఈ సలా కప్ నమ్‌దే కాదు.. ఈ కప్పు కూడా మా అభిమానులకే అంకితం అని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story