కప్ గెలిచి తీరుతం:హర్మన్ ప్రీత్ కౌర్

Harmanpreet Kaur: సొంత గడ్డపై జరగబోయే మహిళల ప్రపంచ కప్ 2025 గెలవాలనే పట్టుదలతో ఉన్నామని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పారు. స్వదేశంలో ఈ టోర్నమెంట్ జరగడం తమకు ఒక మంచి అవకాశం అని, ఈసారి కచ్చితంగా ఆ "బ్యారియర్‌ను" బద్దలు కొట్టి, కప్పు గెలుస్తామని ఆమె అన్నారు. సోమవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జైషా, యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్,హర్మన్ తో పాటు పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన హర్మన్ ప్రీత్.. భారత పురుషుల జట్టు 2011 ప్రపంచ కప్ గెలిచినప్పుడు యువరాజ్ సింగ్ నుంచి తనకు చాలా ప్రేరణ లభిస్తుందని తెలిపారు. తమ జట్టు కూడా అలాంటి చారిత్రాత్మక విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ తమకు ఎంతో ముఖ్యమని, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో ఆడడం ద్వారా తమ జట్టు స్థాయి ఎక్కడ ఉందో తెలుస్తుందని అన్నారు.

2017 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై తాను సాధించిన 171 పరుగుల ఇన్నింగ్స్‌ను కూడా గుర్తు చేసుకున్నారు. ఆ నాక్ తన జీవితంలో ఒక మలుపు అని, ఆ తర్వాత మహిళా క్రికెట్‌కు చాలా గుర్తింపు లభించిందని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story