Washington Sundar: యూకే పర్యటనలో టీమిండియా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపులో ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో మెరిసి అత్యంత కీలక పాత్ర పోషించారు.ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ త్వరగానే విఫలం కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్.. అక్షర్ పటేల్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు.

సుందర్ 52 పరుగులతో, అక్షర్ 57 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. కాగా, ఈ సంచలన ప్రదర్శన తర్వాత వాషింగ్టన్ సుందర్ తన ఆటతీరు వెనుక ఉన్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాలే తన ఈ మెరుగైన ప్రదర్శనకు ప్రధాన కారణమని సుందర్ వెల్లడించాడు.

"రెండేళ్ల కిందటే గంభీర్ నా బ్యాటింగ్ పాత్రపై ఒక స్పష్టత ఇచ్చాడు. నేనేం చేయగలనో అర్థమయ్యేలా చెప్పాడు. ఆశిష్ నెహ్రా కూడా అంతే సపోర్ట్ ఇచ్చాడు. జట్టు విజయం కోసం నావంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా" అని సుందర్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు అక్షర్ పటేల్ కూడా తన ఇన్నింగ్స్ పై సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో బంతిని హిట్టింగ్ చేయడానికి ట్రై చేసి అనుకున్నట్లు ఆడలేకపోయానని, కానీ ఈ వన్డేలో టైమింగ్‌పై దృష్టి పెట్టి పక్కాగా ప్లాన్ అమలు చేశానని అక్షర్ చెప్పుకొచ్చాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story