జీరో రెస్పాన్స్: BCCI

BCCI Under Fire: ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా పాకిస్థానీ చేతులమీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BCCI పాక్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘3 ఎదురుదెబ్బలు.. జీరో రెస్పాన్స్.. ఆసియాకప్ ఛాంపియన్స్.. మెసేజ్ డెలివర్డ్’ అని పేర్కొంది. భారత జట్టు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ట్రోఫీ కాదు.. పాక్‌ను ఓడించడమే టార్గెట్ అన్న సందేశం పంపింది. ఆసియాకప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ACC& PCB ఛైర్మన్‌ నఖ్వీ నుంచి తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజెంటేషన్ సెరమనీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ మాత్రమే మాట్లాడారు. పాక్ కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్ తీసుకున్నారు. IND ప్లేయర్లెవరూ అవార్డులు, మెడల్స్ తీసుకోలేదు. సూర్య ఇంటర్వ్యూ, ట్రోఫీ ప్రజెంటేషన్‌ లేకుండానే సెరమనీ ముగిసింది. ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన పాక్ ప్లేయర్లు డ్రామా మొదలుపెట్టారు. 12 గంటలకు మ్యాచ్ ముగియగా 1.15AM అయినా గ్రౌండ్లోకి రాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. దీంతో ప్రజెంటేషన్ సెరమనీ ఆలస్యమైంది. భారత ప్లేయర్లతో పాటు ACC&PCB ఛైర్మన్ నఖ్వీ చాలాసేపు వెయిట్ చేశారు. గంట తర్వాత పాక్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా గ్రౌండ్‌లోకి రాగా సెరమనీ స్టార్ట్ అయింది. తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story