తిలక్ ఫిట్

Tilak Varma: టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించి టీ20 వరల్డ్ కప్‌కు రెడీ అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తిలక్ (38).. యూఎస్‌ఏతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. ఎన్. జగదీశన్ (104) సెంచరీ, ఆయుష్ బదోని (60) ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఈ పోరులో ఇండియా–ఎ 38 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇండియా–ఎ 20 ఓవర్లలో 238/3 స్కోరు చేయగా.. ఛేజింగ్‌లో అమెరికా 19.4 ఓవర్లలో 200 రన్స్‌కే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఉన్న తిలక్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని ఫామ్ చాటుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి అసౌకర్యం లేకుండా సిక్సర్లు బాదడమే కాకుండా, ఓ అద్భుతమైన క్యాచ్‌తో ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు.

