రంజీ కెప్టెన్ గా తిలక్ వర్మ

Hyderabad Ranji Captain: తిలక్ వర్మ హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌కు జట్టును ప్రకటించింది, దానికి తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్ నియమితులయ్యారు. అయితే తిలక్ వర్మ ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపిక కావడం వలన కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.టీమిండియా ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటన, దక్షిణాఫ్రికా సిరీస్ కారణంగా ఈ రంజీ సీజన్‌కు అందుబాటులో లేరు. గ్రూప్ డిలో ఉన్న హైదరాబాద్ ఈ నెల 15న ఢిల్లీతో తలపడనుంది.

హైదరాబాద్ జట్టు:

తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ ( వైస్-కెప్టెన్) సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి,కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్ ), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్ )

PolitEnt Media

PolitEnt Media

Next Story