Tilak Varma: న్యూజిలాండ్ తో చివరి రెండు టీ20లకు తిలక్ దూరం
టీ20లకు తిలక్ దూరం

Tilak Varma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు తిలక్ వర్మ అధికారికంగా దూరమయ్యాడు.
పొత్తికడుపు శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న తిలక్, ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో అతను ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు.
తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులో కొనసాగుతాడని బీసీసీఐ (BCCI) ధృవీకరించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా, తిలక్‌పై ఒత్తిడి పెంచకూడదని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అతను నేరుగా ఫిబ్రవరి 3న ముంబైలో జట్టుతో కలవనున్నాడు.
భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తిలక్ లేని లోటును ఇషాన్ కిషన్ అద్భుతంగా భర్తీ చేస్తున్నాడు. నంబర్ 3లో ఆడుతూ గత మ్యాచ్‌లలో (ముఖ్యంగా 32 బంతుల్లో 76 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి వరల్డ్ కప్ రేసులో ముందున్నాడు.
మిగిలిన మ్యాచ్‌లు4వ టీ20 విశాఖపట్నం (జనవరి 28)న, 5వ టీ20 తిరువనంతపురం (జనవరి 31)న ఆడనుంది.

