వన్డే వరల్డ్ కప్ కు రెడీ..

ODI World Cup: భారత మహిళల క్రికెట్ జట్టు రాబోయే వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధమైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence) లో 10 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ ను పూర్తి చేసింది. ఫిట్‌నెస్ స్థాయిలను పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, మ్యాచ్ సిమ్యులేషన్స్ ద్వారా ఆటగాళ్లను సిద్ధం చేయడం దీని ప్రధాన లక్ష్యాలు.

ఈ ట్రైనింగ్ లో స్ట్రెంత్,కండీషనింగ్ డ్రిల్స్‌తో పాటు, మ్యాచ్‌లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలపై దృష్టి పెట్టారు.ఈ ట్రైనింగ్ తర్వాత, భారత జట్టుకు కొన్ని కీలకమైన మ్యాచ్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 30 నుంచి స్వదేశంలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ లో శ్రీలంకతో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.

భారత జట్టు ఇప్పటివరకు ఐసీసీ ప్రపంచ టైటిల్ గెలవలేదు. అయితే, ఈసారి స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఆ లోటును తీరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా కీలక సమయాల్లో జట్టు బాగా రాణిస్తే గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ వంటి ఆటగాళ్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story