U19 Asia Cup 2026: U19 ఆసియా కప్ 2026: భారత్ వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ పోరు.. షెడ్యూల్ వచ్చేసింది..
షెడ్యూల్ వచ్చేసింది..

U19 Asia Cup 2026: అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా విడుదల చేసింది. నవంబర్ 8న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది పురుషుల అండర్-19 ఆసియా కప్ టోర్నీ ఒమన్ వేదికగా నవంబర్ 5 నుండి 14 వరకు జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించగా, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో చేర్చడంతో క్రికెట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
గ్రూపుల వివరాలు..
గ్రూప్ - A: భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్.
గ్రూప్ - B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మలేసియా.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్..
భారత అండర్-19 జట్టు తన ప్రయాణాన్ని నవంబర్ 6న నేపాల్‌తో జరిగే పోరుతో ప్రారంభించనుంది.
నవంబర్ 6: భారత్ vs నేపాల్ (ఉదయం 10:30 గంటలకు)
నవంబర్ 8: భారత్ vs పాకిస్తాన్ (ఉదయం 10:30 గంటలకు)
నవంబర్ 10: భారత్ vs యూఏఈ (ఉదయం 10:30 గంటలకు)
గ్రూప్ దశ ముగిసిన తర్వాత రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 12న రెండు సెమీఫైనల్స్, నవంబర్ 14న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరుగుతాయి. టోర్నీలోని మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధం..
గత ఎడిషన్ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా పట్టుదలతో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న పాకిస్తాన్‌ను గ్రూప్ దశలోనే చిత్తు చేసి, టోర్నీలో ఘనమైన ఆరంభాన్ని అందుకోవాలని యువ భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు భారత్ రికార్డు స్థాయిలో 8 సార్లు ఈ టైటిల్‌ను ముద్దాడింది. నవంబర్ 8న జరగబోయే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

