భారత్ గ్రాండ్ విక్టరీ

Under-19 Asia Cup 2025: అండర్-19 ఆసియా కప్‌ 2025లో టీమిండియా వరుసగా రెండు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది . టీమిండియా తమ రెండవ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.1 ఓవర్లలో 240 ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్ లో ఆరోన్ జార్జ్ (85) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు బౌలింగ్ లో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

241 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 150 పరుగులకు ఆలౌటైంది. ఫాస్ట్ బౌలర్ దీపేష్ దేవేంద్రన్ చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హుజైఫా అహ్సాన్ 70 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో మూడు వికెట్లు తీసుకొని పాక్ ను చిత్తు చేశారు.

యూఏఈపైటీమిండియా తమ టోర్నీని ఆతిథ్య జట్టు అయిన యూఏఈ (UAE) పై 234 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు చేసి, యూఏఈపై జట్టు స్కోరును రికార్డు స్థాయిలో 433 పరుగులకు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.ఈ రెండు విజయాలతో టీమిండియా గ్రూప్-Aలో బలమైన స్థానాన్ని దక్కించుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story