Under-19 World Cup 2026: జింబాబ్వేపై 204 పరుగుల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ
ఇండియా గ్రాండ్ విక్టరీ

Under-19 World Cup 2026: అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్ సిక్స్ పోరులో భారత జట్టు జింబాబ్వేపై 204 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.విహాన్ మల్హోత్రా 107 బంతుల్లో 109 పరుగులు (నాటౌట్) చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.వైభవ్ సూర్యవంశీ కేవలం 30 బంతుల్లోనే 52 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.
అభిజ్ఞాన్ కుందు 62 బంతుల్లో 61 పరుగులు చేసి విహాన్ మల్హోత్రాతో కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.
లీరాయ్ చివావులా జింబాబ్వే జట్టులో 62 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.భారత బౌలింగ్ కెప్టెన్ ఆయుష్ మాత్రే 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ఉధవ్ మోహన్ కూడా 3 వికెట్లతో రాణించాడు.
భారత జట్టు తన తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 1న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

